మరో అంతర్జాతీయ పురస్కారం అందుకోబోతున్న బలగం వేణు..!

-

జబర్దస్త్ కమెడియన్ వేణు తాజాగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి సినిమాతోనే దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు వేణు. కమర్షియల్ గానే కాకుండా అటు అవార్డ్స్ సొంతం చేసుకోవడంలో కూడా ఈ సినిమా దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించిందని సమాచారం. తెలంగాణ సంస్కృతి.. పల్లెటూరి పచ్చదనాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు వేణు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇటీవలే ఓటీటీ లోకి వచ్చి మంచి ఆదరణ పొందడమే కాదు పల్లెటూర్లలో అయితే ఏకంగా ఆరుబయట స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మరి ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు అంటే ఏ రకంగా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు రూ.25 కోట్ల వసూలు చేసింది. ఇప్పటికే బలగం సినిమా రెండు లాస్ ఏంజెల్స్ సినిమా ఆటోగ్రఫీ అవార్డులు అందుకోగా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డు కూడా లభించింది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం విభాగంలో ఉక్రేయిన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పిలవబడే ఒనికో ఫిలిం అవార్డు సొంతం చేసుకుంది. ఇక దీనిపై చిత్ర బృందం ఇదంతా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది అంటూ ట్వీట్ చేసింది.

కావ్య కళ్యాణ్ రామ్, ప్రియదర్శి నటీనటులుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత రెడ్డి , హన్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరొకవైపు వేణుకి కూడా దిల్ రాజు ఇంకొక ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news