ఇండస్ట్రీ హిట్ సింహాద్రికి నో చెప్పిన బాలయ్య….ఎందుకో తెలుసా..?

-

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాలి అనుకున్న సినిమా కథను వేరే హీరోతో చేయడం సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఆ కథ ఆ సమయంలో ఆ హీరో కు నచ్చక పోవచ్చు, లేదా ఆ హీరో ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాకు డేట్లు కుదరక సినిమా నుంచి తప్పుకోవచ్చు. ఇలా అనేక కారణాల వల్ల ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ మరో హీరోతో తెరకెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి సినిమాల్లో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ లుగా నిలిచినవి ఉంటాయి, అలాగే బ్లాక్ బస్టర్ విజయాలను సాదించిన సినిమాలు కూడా ఉంటాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి దర్శకుడిగా రాజమౌళికి, హీరోగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను తీసుకువచ్చిన సింహాద్రి సినిమా కథ కూడా మొదట నందమూరి నటసింహం బాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట, కాకపోతే ఆ సమయంలో బాలకృష్ణ కు ఆ కథ నచ్చకపోవడంతో అదే కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

అయితే అలా బాలకృష్ణ మిస్ చేసుకున్న కథతో జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో మాస్ హీరోగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సింహాద్రి సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు. అయితే విజయేంద్ర ప్రసాద్ గారే స్వయంగా సింహాద్రి కథను మొదట బాలకృష్ణ గారి కోసం రాసినట్లు తెలియజేశాడు. అది మాత్రమే కాకుండా బాలకృష్ణ గారి కోసం సింహాద్రి కథను తయారు చేసినప్పుడు అందులో ముగ్గురు హీరోయిన్ లు అని, ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక హీరోయిన్ పాత్రను తీసివేసి ఇద్దరు హీరోయిన్ లు మాత్రమే ఉండే విధంగా కథను తయారు చేసినట్లు విజయేంద్రప్రసాద్ తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version