బాలకృష్ణకు పద్మభూషణ్.. తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7..!

-

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1 అలాగే 5 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అయితే పద్మ అవార్డులు ఎవరికీ వచ్చాయో చూస్తే.. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ వైద్యంలో ఇచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణకు కళారంగంలో పద్మభూషణ్ ఇచ్చారు.

ఇక మంద కృష్ణ మాదిగకు తెలంగాణ నుండి ప్రజా వ్యవహారాలలో పద్మశ్రీ.. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేఎల్ కృష్ణకు పద్మశ్రీ.. మాడుగుల నాగఫణి శర్మకు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగంలో పద్మశ్రీ.. అదే కళారంగం నుండి మిర్యాల అప్పారావు ఆంధ్ర ప్రదేశ్ నుండి పద్మశ్రీ.. ధిరాజు రాఘవేంద్ర చార్య పంచముఖి ఆంధ్రప్రదేశ్ నుండి సాహిత్యం, విద్యలో పద్మశ్రీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news