హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాలయ్య ఆకస్మిక తనిఖీలు..!

నటసింహం నందమూరి బాలయ్య కృష్ణా జలాలపై తన నియోజకవర్గం హిందూపురంలో పార్టీ నేతల కీలక సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలయ్య ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై బాలయ్య రోగులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సరైన వైద్యం అందడం లేదని రోగుల నుండి ఫిర్యాదులు వచ్చాయని బాలయ్య చెబుతున్నారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలోనే ఇంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే బాలయ్య వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.