ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఇద్దరు మంచివాళ్లే : బాలయ్య

ఈరోజు ఉదయం 8 గంటలకు మా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా సినీ తారలు ఓటు వేసేందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ ఇతర నటీనటులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓటు వేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ …ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మా అసోసియేషన్ కు అన్నదమ్ముల్లాంటి వాళ్ళు అని అన్నారు. మా లో రెండు వర్గాలు లేవు అని…అందరం ఒక్కటే అని అన్నారు.

ఇద్దరు వ్యక్తులు చేతల్లో చూపించేవాల్లే అని అన్నారు. ఎలక్షన్ అన్న తర్వాత కొద్దిగా హడావుడి ఉంటుంది అన్నారు. పోలింగ్ కు వస్తే షూటింగ్ కి వచ్చినట్లు ఉందని అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఎవరు గెలిచినా మొత్తం భారం వాళ్ల పైనే వేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఈసారి మా ఎన్నికల్లో ఉన్నంత హడావిడి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఇద్దరూ మంచి మేనిఫెస్టోను చూపించారని చెప్పారు. మా కోసం పనిచేయడం ప్రతి ఆర్టిస్ట్ బాధ్యత బాలయ్య అన్నారు.