‘మా’ ఎన్నికల రసాబాస : చంపేస్తామంటూ మోహన్ బాబు వార్నింగ్ !

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ఈ ప్రాంతంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగిన ఈ మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రసాబాస నెలకొంది. పోలింగ్ బూత్ నిర్వహణపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయారు. అంతే కాదు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన ప్రముఖ నటుడు బెనర్జీ మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో తేడా జరిగితే… చంపేస్తా నంటూ బెనర్జీపై ఆవేశంతో ఊగిపోయారు మోహన్ బాబు. దీంతో పోలింగ్ కేంద్రంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అంతేకాదు.. మోహన్‌ బాబు ఆగ్రహం చెందడంతో విష్ణు ప్యానల్ తో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గొడవకు దిగినట్లు సమాచారం అందుతోంది. నమూనా బ్యాలెట్ ఇస్తున్నారు అని శివారెడ్డిని అడ్డుకుంది విష్ణు ప్యానల్. ఇక వివాదం పై చెలరేగడంతో ఇరు వర్గాలను దూరంగా పంపారు పోలీసులు.