బండి సంజయ్ కాదు పాన్ షాప్ సంజయ్..కిషన్ రెడ్డి.. కుర్కురే కిషన్ రెడ్డి – బాల్క సుమన్‌

-

బండి సంజయ్ కాదు పాన్ షాప్ సంజయ్ ణకిషన్ రెడ్డి కాదు కుర్కురే కిషన్ రెడ్డి అని బాల్క సుమన్‌ విమర్శలు చేశారు. ..మోడీ తూటాలకు బలైన రాకేష్ కుటుంబానికి టీ ఆర్ ఎస్ అండగా ఉంటుందన్నారు. యువతతో పెట్టుకున్న వాడు ఎవడూ బాగు పడలేదు..ఆర్మీ నియామక ప్రక్రియ ను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ జరిపినట్టే కేంద్రం లో జరగాలి…రేవంత్ రెడ్డి తలా తోక లేని మాటలు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని విమర్శించారు. సికింద్రాబాద్ ఆందోళనల్లో పార్టీ లకు సంబంధం లేదని అందులో పాల్గొన్న వారే చెప్పారని.. ఆర్మీ లో పెన్షన్ భారాన్ని వదిలించుకునేందుకు కేంద్రం అగ్ని పథ్ తెచ్చిందని ఆగ్రహించారు.

ఆర్మీ ని కూడా మోడీ వ్యాపార సంస్థగా మారుస్తున్నారు.. .బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలేనన్నారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదు..బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. కాశ్మీర్ నుంచి కన్య కుమారి దాకా ప్రజలు బీజేపీ పై తిరుగు బాటు చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version