రైల్వే స్టేషన్ లలో షూటింగ్ వల్ల రైల్వే సంస్థ కు ఎన్ని కోట్లు ఆదాయం తెలుసా..?

-

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మనం ఎన్నో సినిమాలలో రైళ్ల సన్నివేశాలు చూస్తూనే ఉంటాము. ఇందులో ఇండియన్ మూవీస్ లో రైల్వే సన్నివేశాలతో ఎక్కువగా సంబంధం ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని చిత్రాలకు హీరోలు, హీరోయిన్లు ఎంట్రీ వంటి సన్నివేశాలు కూడా ఎక్కువగా రైల్వే స్టేషన్లలో రైల్వే కంపార్ట్మెంట్లలో చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది. మరికొన్ని చిత్రాలు అయితే ఏకంగా సినిమాలోని సగభాగం అంత రైల్వే స్టేషన్ లోనే పూర్తి చేయవలసి ఉంటుంది.

అయితే రైల్వేస్టేషన్లో సినిమా సన్నివేశాలు చిత్రీకరించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం అంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దీని ద్వారా రైల్వేశాఖకు భారీగానే లాభం వస్తుందట. 2021 వరకు ఒరిజినల్ రైల్వేస్టేషన్లో గానీ ట్రైన్ సన్నివేశాలు తెరకెక్కించాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది.. అందుకోసం రైల్వే శాఖ అనుమతి పొందడంతోపాటు నెలల తరబడి సమయం కూడా పట్టేది. కొన్నిసార్లు చాలా సమయం కూడా పట్టేది. కానీ ప్రస్తుతం FFO.GOVT.IN అనే వెబ్సైట్ ద్వారా ఈ పద్ధతి చాలా సులువు గా మారిపోయింది.

అయితే 2008 వ సంవత్సరం వరకు ట్రైన్స్ సన్నివేశాల షూటింగ్ చేయాలంటే దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేయటం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మారుతున్న విలువలను బట్టి ట్రైన్లో సన్నివేశాలు చిత్రీకరించాలంటే.. రోజుకు రూ.4.74 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. దీని వల్ల కేవలం నాలుగు కోట్లకే ఒక స్పెషల్ ట్రైన్, SLR ఉన్న ట్రైన్ సన్నివేశాలను చిత్రీకరించుకోవచ్చట. ఇక అంతే కాకుండా 2017 సర్వే ప్రకారం.. 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడానికి అనుమతి ఉండేదట. అయితే అందులో కేవలం రెండు బోగీలకి మాత్రమే అనుమతి ఉండేది. ఇక 2021 లెక్కల ప్రకారం సెంట్రల్ రైల్వే జోన్ కు రూ.2.48 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version