జీహెచ్ఎంసీ ఎన్నికలు : హైదరాబాద్ చేరుకున్న 15000 బ్యాలెట్ బాక్సులు

-

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ నగరానికి 15000 బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. వీటిని విక్టోరియా ప్లే గ్రౌండ్‌ లో అధికారులు భద్రపరిచారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన మరునాడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి బ్యాలెట్‌ బాక్సులు తెప్పిస్తున్నారు అధికారులు. విశాఖ పట్టణం నుంచి 4,750, చిత్తూరు నుంచి 950 బాక్సులను పది లారీల్లో తెప్పించారు అధికారులు. ఈ బాక్సులను చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌ లో భద్ర పర్చారు.

నాలుగైదు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 29 వేల బాక్సులు నగరానికి చేరుకుంటాయని అంచనా. విక్టరీ ప్లే గ్రౌండ్‌ లోని భవనంలో స్థలం సరిపోకుంటే హరిహర కళా భవన్‌ లో ఈ బ్యాలెట్‌ బాక్సులు ఉంచేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో 11,500 నుంచి 12 వేల వరకు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 30 వేలకుపైగా బాక్సులు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం తరలించిన బాక్సులను తిరిగి తీసుకువస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version