సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆరోగ్య శాఖలో మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఏడు నెలల నుంచి వైద్య శాఖలో పని చేసిన ప్రతి ఒక్కరిని ఉపసంఘం అభినందించిందని ఆయన అన్నారు. తెలంగాణ వైద్య శాఖ దేశంలో మూడో స్థానంలో ఉందన్న ఆయన సబ్ సెంటర్ల స్థానంలో వెల్ నెస్ సెంటర్ల బలోపేతం చేస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు సమకూర్చుకోవాలన్న ఆయన అవయవ మార్పిడి కోసం సర్కార్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో హెల్త్ సెంట్రర్లతో పాటూ బస్తి దవాఖానలు ప్రారంభించామని అన్నారు.
డయోగ్నోసిస్ సేవలు మరింత అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన ప్రయివేటు అంబులెన్స్ ల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొనున్నామని అన్నారు. తెలంగాణా లో 108, 104 ల్, 102 సర్వీసులకు.. ప్రభుత్వమే నిధులు ఖర్చు పెడుతోందని, ఒక్క ఆరోగ్య శ్రీ కోసం 12 వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని అన్నారు. మరోపక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఖర్చు అవుతోందని, ఆయుష్మాన్ భారత్ కంటే, ఆరోగ్య శ్రీ మెరుగ్గా ఉందని అన్నారు. ఆరోగ్య శ్రీ లోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఆయన తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ రెడి చేస్తామని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఎపుడు అనేదానిపై రకరకాలుగా చెబుతున్నారని, ఒకవేళ వాక్సిన్ వస్తే, ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్ళకు ప్రియార్టీ ఇస్తామని అన్నారు. వాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.