తెలంగాణలో గుట్కా, పాన్ మసాలపై నిషేధం

-

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై వరుసగా దాడులు చేస్తున్నారు.తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.గుట్కా, పాన్ మాసాలపై నిషేధం విధిస్తూ సంచల నిర్ణయం తీసుకున్నారు. నికోటిన్, పొగాకుతో తయారయ్యే గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మే 24నుండి ఒక సంవత్సరం పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

పొగాకు, నికోటిన్ తో తయారయ్యే గుట్కా, పాన్ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. ఫైబ్రోసిస్, నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా.అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వీటిపై శాశ్వతంగా నిషేధం విధిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news