కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ మధ్య తరచుగా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పందించారు. తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తు్న్నానంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని విమర్శించారు.

తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని  తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఆరోపించారు . బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news