రైతులకు అలర్ట్ :ఈ మూడు పురుగుల మందులపై నిషేదం..!

-

పంటలపై దాడి చేసే చీడ పురుగులను, దోమలను నివారించేందుకు కొన్ని రకాల పురుగుమందులను వాడుతుంటారు. అయితే కొన్ని రకాల పురుగుమందులు పర్యావరణానికి మరియు పంటకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. అంతే కాకుండా కొన్ని రకాల మందులు పురుగులను నివారించడం లో ఎలాంటి ప్రభావం చూపించవు. దాంతో రైతులు నష్టపోతారు. అలాంటి మూడు రకాల పురుగుల మందులను తెలంగాణ వ్యవసాయ శాఖ బ్యాన్ చేయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

చీడ పురుగు నివారణకు పంటలపై చల్లే ఆస్ట్రో అగ్రి టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన “మోనో ఫిల్” ను నిషేదించినట్టు పేర్కొంది. అదేవిధంగా అగ్రి సన్ క్రాప్ సైన్స్ కంపెనీ కి చెందిన “సన్ ఫెక్స్” మరియు శ్రీ ఇండస్ట్రీస్ కంపెనీ కి చెందిన “శ్రీధానే” మందులను బ్యాన్ చేసినట్టు తెలిపింది. ఈ మందులను వ్యాపారస్తులు అమ్మవద్ధని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మూడు మందులను మార్కెట్లో విక్రయించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news