తిక్కతిక్క క్వారంటైన్ నిబంధనలతో చిరాకుపుట్టిస్తున్న యూకే తాజాగా ఇండియా దెబ్బకు దారికొచ్చింది. ఇన్నాళ్లు సీరం సంస్థ తయారీ కోవిషీల్డ్ ను గుర్తించకుండా నాటకాలు ఆడిన యూకే తాజాగా కోవిషీల్డ్ ను గుర్తించింది. వీటితో పాటు 10 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధనను కూడా మార్చింది. తాజాగా యూకే భారతీయులకు విధించిన నిబంధనల మాదిరిగానే దెబ్బకుదెబ్బ అన్నట్లుగా భారత్ కూడా యూకే ప్రయాణికులపై అలాంటి నిబంధనలనే విధించింది.
తాజాగా యూకే ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనకు తెరపడింది. WHO ఆమోదించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులు యూకేకి రాగానే 10 రోజులు క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని యూకే నిర్ణయం తీసుకుంది. యూకేకి రావడానికి 14 రోజుల ముందు కోవిషీల్డ్ కానీ ఇతర గుర్తించిన వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు వారి రాకకు ముందురోజు, 8 వరోజు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసం లేదని తెలిపింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఈనెల 11 నుంచి అమలులోకి రానున్నాయి.