విదేశీ టూరిస్టులకు కేంద్రం గుడ్ న్యూస్

-

ఇండియాను సందర్శించాలనుకుంటున్న విదేశీ పర్యాటకులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దాదాపుగా సంవత్సరంన్నర మూడపడిన పర్యాటకాన్ని పట్టాలు ఎక్కించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి విదేశీ పర్యాటకుల్ని అనుమతిస్తూ విసాలు జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో విదేశీ పర్యాటకుల్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నెల మాత్రం కొన్ని నిబంధనలు విధించింది. ఇండియాను సందర్శించాలనుకుంటున్న ఇతర దేశాల టూరిస్టుల నవంబర్ 15 వరకు ప్రత్యేక చార్టెడ్ విమానాలలో రావాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాతే కమర్షియల్ ఫ్లైట్ లో వచ్చేవారికి అనుమతిస్తామని తెలిపింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టూరిజం వల్ల వచ్చే ఆదాయంపై ద్రుష్టి సారించింది. తాజా నిర్ణయం వల్ల విదేశాల నుంచి వచ్చి భారత్ సందర్శించాలనుకుంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి. కోవిడ్ వల్ల టూరిజం, హోటల్ బిజినేస్ చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుత నిర్ణయం వల్ల ఈ రంగాలకు గత వైభవం తీసుకురావడానికి సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news