హుజురాబాద్ ఉప ఎన్నిక వాడీ వేడీ సాగుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే… అన్ని పార్టీలు హుజురాబాద్‌లో పాగ వేశాయి. అంతేకాదు… ప్రజలకు దగ్గరయ్యేందుకు అనేక ప్రలోభాలకు తెర లేపుతున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కలువనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు.
అయితే..ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరుగుతోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ తో కలిసి సమావేశం అయ్యేందుకు సమయం కోరానని చెప్పిన బండి సంజయ్…. ఈ సమావేశంలో తెలంగాణ లో నెలకున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు వివరిస్తామని తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును కూడా వివరిస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్. కాగా… అటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రచార కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే.