తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు నేటితో నెల రోజులు పూర్తి కానుంది. ఆగస్ట్ 28న చేపట్టిన బండి యాత్ర హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి మీదుగా ప్రస్తుతం కరీంనగర్ చేరింది. యాత్ర మొదలు టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్మలు గుప్పించారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలైన సీఎం కేసీఆర్, కేటీఆర్లను విమర్శిం
చారు. బండి సంజయ్ యాత్రలో వివిధ వర్గాల వారు కలసి తమతమ సమస్యలను బండి ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో బండి వరసగా సీఎంలకు వివిధ సమస్యలపై లేఖలు రాశారు. ఇప్పటి వరకు పలువరు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రలైన ఫడ్నవీజ్, రమణ్ సింగ్ లు బండి సంజయ్ యాత్రలో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీన బండి సంజయ్ యాత్ర మొదటి విడత పూర్తవుతుంది. హుజూరాబాద్లో భారీ పాదయాత్ర ద్వారా మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్రను పూర్తి చేయనున్నారు. యాత్ర ముగింపుకు స్మ్రతి ఇరానీ ముఖ్య అతిధిగా రానున్నారు.