తెలంగాణ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా సోమవారం ఢిల్లీ నుండి సీఎం కేసీఆర్ రాష్ట్ర సీఎస్ తో సమీక్షించారు. రాష్ట్రం లో పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ ఇతర యంత్రాంగం సమన్వయం పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరం అయితే హైదరాబాద్ మరియు కొత్త గూడెం లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక భారీ వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశారు. సచివాలయం లోనూ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.