సీఎం కేసీఆర్ పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు, రాసిపెట్టుకోండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ టెన్ జన్ పథ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నారని.. సీఎం కేసీఆర్ నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ అవుతారంటూ… సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాఫెల్ విమాన కొనుగోళ్లలో స్కామ్ జరిగితే కాంగ్రెస్, వాళ్ల అధినేత ఊరుకునే వారా..? అంటూ ప్రశ్నించారు. సుప్రీం కోర్ట్ రఫేల్ డీల్ లో క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. రఫెల్ కొనుగోళ్లపై వ్యాఖ్యలు చేశారంటే కేసీఆర్ సుప్రీం కోర్ట్ను ధిక్కరించడమే అవుతుందని ఆయన అన్నారు. త్రివిధ ధళాధిపతులు విచారణ చేసి సుప్రీం కోర్ట్కు నివేదిక సమర్పించారని.. నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. దేశ ప్రధాని, త్రివిధ దళాధిపతులపై కేసీఆర్ కు నమ్మకం లేదని ఆయన విమర్శించారు. గతంలో సోనియా గాంధీతో పీసీసీ ప్రెసిడెంట్ కావాలని, ముఖ్యమంత్రి కావాలంటే ఆమె అంగీకరించలేదని.. ఇప్పడు ప్రగతి భవన్ నుంచి గాంధీ భవనే అని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసిపెట్టుకోవాలని.. తరువాత పీసీపీ ప్రెసిడెంట్ కేసీఆరే అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version