కేసీఆర్‌ 37 మంది ఎమ్మెల్యేలను కొన్నారు : బండి సంజయ్‌

-

మునుగోడు ప్రచారంలో బీజేపీ జోష్ పెంచింది. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కు పెడుతూ మునుగోడు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మర్రిగూడలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికలో ఓడిపోతామని తెలిసినా.. చండూరు సభలో సీఎం కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

“సర్కస్‌లో జంతువుల మాదిరిగా నలుగురు ఎమ్మెల్యేలను హెలికాప్టర్‌లో తీసుకొచ్చి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తప్పు చేయనప్పుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు ప్రమాణం చేయట్లేదు? సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్న కేసీఆర్‌ .. ఎమ్మెల్యేల భేరసారాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కొంటున్నారు. వరి వేస్తే ఉరి అన్నది కేసీఆరే. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మీటర్ల పేరు చెప్పి విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. డిస్కమ్‌లు నష్టాల్లో ఉండటానికి కారణం సీఎం కాదా?’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version