ఫాంహౌజ్ లో కేసీఆర్.. క్షుద్ర, తంత్ర పూజలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. సీఎం కేసీఆర్ తన ప్రత్యర్థులు నాశనం కావాలనుకుంటున్నడని.. గోరక్షుకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని.. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం రాష్ట్రానికి శాంతి భద్రతల సమస్యను స్రుష్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్… నిఖార్సైన హిందువని గొప్పలు చెప్పుకుంటున్నాడని.. ఇతరులు నాశనం కావాలని సీఎం తాంత్రిక పూజలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌజ్ లో జరిగేవన్నీ యాంత్రిక, తాంత్రిక పూజలేనని.. గతంలో ఓ సీఎం ఇట్లనే చేసిండు… చివరకు ఏమైందో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. హోంమంత్రి ఉన్నాడో లేదో… ఆయనెవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదని.. రోహింగ్యాలకు షెల్టర్ కల్పించడం తప్ప ఆయన చేసేదేమీ లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.