దుమారం రేపుతున్న బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు.. ఇలా చేశాడేంటి..?

-

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా జ‌లాలు మాకంటే మాకని.. మొన్నటి దాకా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శుల చేసుకున్నారు. మీరు ఎక్కువగా వాడుకుంటూ అన్యాయం చేస్తున్నారని ఒకరు ఆరోపిస్తే… లేదు మీరే వాటా కన్నా ఎక్కువగా వాడుకుంటూ అన్యాయం చేస్తున్నారని కౌంటర్ విసిరారు. ఈ గొడవలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారి ప్రజల వద్ద మంచిగానే సెంటిమెంట్ ను రగిల్చి పేరు సంపాదించుకున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ ఇలా జరుగుతుండగానే….

 

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు షాక్ తిన్నాయని కొంత మంది చెబుతున్నారు. కేంద్రం రాష్ర్టాల మధ్య నీటి పంచాయతీ లేకుండా పెత్తనం మొత్తం నీటి యాజమాన్య బోర్డులకు అప్పగించింది. దీంతో స్థానిక ప్రభుత్వాలు చేసేదేం లేక గమ్మున ఊరుకున్నాయి. ఇన్నాళ్లు చేసుకున్న విమర్శలు ప్రతి విమర్శలు ఇప్పుడు కనుమరుగయ్యాయి.

అయితే తాజాగా ఈ కృష్ణా జలాల వివాదంపై స్పందించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటి దాక ఇరు రాష్ర్టాల సీఎంలు కృష్ణా జలాల విషయాన్ని ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు వాడుకున్నారని, కానీ ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన విధానం బాగుందని అన్నారు. కొంత మంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని వాదిస్తుంటే బండి సంజయ్ మాత్రం కేంద్రం విధానం పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version