ఇటీవల బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీజేపీ తనపై చూపించిన నమ్మకానికి పొంగిపోయిన బండి సంజయ్ తగు రీతిలో బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేశారు. అంతే కాకుండా ఈ రోజు ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలుసుకున్నారు. బండి ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత మోదీని కలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ .. శభాష్ బండి సంజయ్ తెలంగాణాలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చాలా కష్టపడ్డావు అంటూ అభినందించారు. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింతగా కస్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మోదీ బండి సంజయ్ కు చెప్పారు. దీనితో బండి సంజయ్ పై మరింతగా బాధ్యత పెరిగింది అని చెప్పాలి.
ఇక ఇతని స్థానంలో కిషన్ రెడ్డిని జెడ్పీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసింది. మరి కేసీఆర్ ను తట్టుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే అనుమానమే