ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా వరుసగా ఎంపీలతో మీటింగ్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు అన్నీ మూకుమ్మడిగా బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో తిరుగుతున్న నేపథ్యంలో వారి వ్యూహాలను తిప్పికొట్టాలని ఎంపీలకు క్లాస్ లు తీసుకుంటున్నారు మోదీ. ఇందులో భాగంగా ఎంపీలకు పలు కీలకమైన సూచనలను మరియు సలహాలను ఇచ్చారు మోదీ. మోడీ మాట్లాడుతూ .. మీరు ఎక్కడ ఎవరితో మీటింగ్ లు పెట్టినా ఎటువంటి పరిస్థితుల్లో వివాదం అయ్యే వ్యాఖ్యలు చేయకండి అంటూ గట్టిగా మందలించారు. ఇంకా ప్రత్యర్ధులు మీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మీరు తొందరపడకుండా ఉండాలనతో వార్నింగ్ ఇచ్చారు మోదీ. మనల్ని అధికారంలోకి దించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి వారి ట్రాప్ లో మీరు పడొద్దు అంటూ మోదీ ఎంపీలు అందరికీ ఉపదేశం చేశారు.
ఎందుకంటే ఈ సారి దేశవ్యాప్తంగా ప్రజలకు బీజేపీ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. మరి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏమి జరగనుందో చూడాలి.