ASIA CUP 2022 : అర్షదీప్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌ శర్మ !

-

ఆసియా కప్‌ లో భాగంగా నిన్న ఇండియాపై పాక్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్‌ లో టీమిండియా ఓ రికార్డును నమోదు చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియాకు ఓపెన్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే.. భారత బ్యాటర్లు ఆకట్టుకున్న, బౌలర్లు విఫలం కావడంతో హోరా హోరి లో దాయాదిదే పై చేయి అయింది. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్నోయి బౌలింగ్ లో అర్షదీప్ జారవిడిచిన క్యాచ్ వల్ల రోహిత్ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

అర్షదీప్ తప్పిదంతో బతికిపోయిన ఆటగాడు ఆసిఫ్ ఆలీ, ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పాక్ గెలిచింది. కీలకమైన సమయంలో అర్షదీప్ క్యాచ్ నేలపాలు చేయడంతో ఉత్కంఠంగా మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక మైదానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే దాయాదితో ప్రతిష్టాత్మక పోరు, అందున పట్టు బిగించే తరుణంలో అర్షదీప్ క్యాచ్ అందుకోలేకపోవడంతో హిట్ మ్యాన్ సహనం కోల్పోయాడు. ‘ఏంటిది, ఏం చేశావో అర్థమయిందా నీకసలు’ అన్నట్లుగా అరుస్తూ అర్షదీప్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version