కేసీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడో చెప్పాలి – బండి సంజయ్‌

-

కేసీఆర్ ఢిల్లీ ఎందుకు పోయాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ముఖ్యమంత్రి నే ఢిల్లీ పారిపోయినవ్ మా పరిస్థితి ఏంటని మిగతా నాయకులు దిగాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని.. ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని వెల్లడించారు.

రెండు సార్లు యాత్రలు సక్సెస్ అయ్యాం కేంద్ర మంత్రులు నాయకులు హాజరయ్యారని.. ఇలవేల్పు అయిన యాదాద్రి నుండి మూడో ప్రజా సంగ్రామ యాత్ర మెదలై 5 జిల్లాలు 12 శాసనసభ స్థానాల్లో కొనసాగుతుందని చెప్పారు. బాసర విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి కి విద్యార్థులు బాధలు తెలియట్లేదని వివరించారు.

బాసర విద్యార్థులపై ఎందుకు కక్షనో అర్థం కావట్లేదని.. గురుకుల పాఠశాలలో పురుగులు అన్నం నీళ్లు పోసి సాంబారు పెడుతున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంటే కేసీఆర్ పడదని.. బాసర లో విద్యార్థులు తిండి కోసం అడుగుతుంటే మంత్రులు వెళ్లి హేళన చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version