భాగ్యనగరంలో తప్పకుండా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. రోహింగ్యాలను తరిమికొడతామన్న మాట చెప్తే.. యువకులను సంజయ్ రెచ్చగొడుతున్నాడు అంటున్నారని, హైదరాబాద్ లో ఇక రంగు రంగుల జెండాలు ఉండవు. కాషాయ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. ఇక ఒకడు తాగుబోతు మంత్రి… ఒకడు వాగుబోతు మంత్రి.. ఇంకొకడు బూతు మంత్రి ఇంకొకడు తిరుగుబోతు మంత్రి..ఇదీ కేసీఆర్ కేబినెట్ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా నువ్వు చేసిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పు.. సవాల్ చేస్తున్నానని ఆయన అన్నారు. పాస్పోర్ట్ ల బ్రోకర్ సీఎం అయితే.. ఇలానే ఉంటది.
అందుకే నా సంతకం ఫోర్జరీ చేసి 10 వేల సాయం ఆపేసాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మందుతాగి రోడ్డు మీద బండి నడిపితే తప్పు అయినప్పుడు… మందుతాగి రాష్ట్రాన్ని పాలిస్తా అంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. కారు… సారు… ఇకరారు అంటూ ఆయన కామెంట్ చేశారు. మతవిద్వేషాలు చెలరేగుతాయి.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది అని పక్కా సమాచారం ఉంది అంటున్నారని, మరి పక్కా సమాచారం ఉంటే… వాళ్ళను పట్టుకోండి.. అరెస్ట్ చేయండి.. గొడవలు జరగకుండా ఆపండి అని ఆయన్ అన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ కి వస్తున్నారు కాబట్టే.. భయంతో.. ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. గొడవలు అని చెప్పి… ప్రజలు ఓటు వేయకుండా ఆపుతారా ? అని ఆయన ప్రశ్నించారు.