గ్రేటర్ : బీజేపీ నయా ప్లాన్.. కులాల వారీగా రంగంలోకి ఏపీ నేతలు !

-

గ్రేటర్ లో ఎలా అయినా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ అందుకు అనుగుణంగా ఉన్న అన్ని మార్గాలను వాడుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు సైతం ప్రచారానికి సిద్దం అవుతోండగా కొత్తగా ఏపీ నేతలను కూడా అధిష్టానం రంగంలోకి దింపింది. తాజాగా ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులతో అదే సామాజిక వర్గానికి చెందిన టిజి వెంకటేష్ సమావేశం అయ్యారు. అలానే కమ్మ సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యారు సీఎం రమేష్. ఎల్లుండి కూకట్పల్లి ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కూడా పాల్గొననున్నారు. ఇక్కడే మకాం వేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి బండి సంజయ్ కాపు సంఘం ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

ఇక పవన్ పిలుపుతో బీజేపీ ప్రచారంలో జనసేన శ్రేణులు కూడా పాల్గొంటున్నాయి. రోడ్ షో లలో జనసేన జండాలు సైతం కనిపిస్తున్నాయి. ఇక నేటి నుంచి ప్రచారానికి రాజాసింగ్ కూడా వస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని డీకే అరుణకు రాజా సింగ్ చెప్పినట్టు సమాచారం. ఇక ఈరోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నగరంలో ప్రచారం చేయనున్నారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు ఆయన. ఇక ఆ రూట్ ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ పరిశీలించారు. అది పూర్తి అయ్యాక రేపు తాజ్ బంజారా లో మేధావుల సమావేశంలో కూడా అయన పాల్గొననున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version