గెలిచిన వెంటనే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్చ ఇస్తాం, పాతబస్తీపై బండి సంజయ్…!

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పాతబస్తీపై బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలుచేసారు. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోంది? అని ఆయన ప్రశ్నించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్దర్వాజ గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారు? అని ఆయన నిలదీశారు.

హిందువుల ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు కబ్జా చేశారు? అని ఆయన సంచలన ప్రశ్నలు వేసారు. పోలీసులు హీరోలు అన్నారు. భాగ్య నగర్ లో బీజేపీని గెలిపించండి. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం అన్నారు. పాకిస్థాన్ కుక్కలను, బాంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి తరిమేస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచం అని, డాక్టర్లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version