అన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి పీకుతాడు : బండి సంజయ్.

-

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ ను గెలిపించాలని కోరుతూ గుర్రంపోడు మండలం కొప్పోలులో రోడ్ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నేతలు,జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కోతల రాయుడు  సీఎం కేసీఆర్ సాగర్ కు వస్తున్నాడని, ఎస్ఎల్బిసి  కుర్చీ వేసుకుని పూర్తి చేస్థా అన్నాడు ఇప్పటికి పూర్తి చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్, టీఆర్ఎస్ దొంగలు వచ్చారు.

దగుల్బాజి గాళ్ళు వచ్చారు.మద్యం డబ్బు తో మాయమాటలతో మోసం చేసేందుకు వచ్చారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ఎందుకు సాగర్ లో ఓటు వేయాలి ? అన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి పీకుతాడు, కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు అన్ని తీసుకొని వచ్చా, రేషన్ బియ్యానికి 29 రూపాయలు కేంద్రం ఇస్తుంది.రాష్ట్రం ఒక్క రూపాయి ఇస్తున్నారు.. ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించండని అన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటు  కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నారుని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version