తెలంగాణ నెంబర్ 1 ద్రోహి కేసీఆర్…ఆంధ్రకు నీళ్లు అమ్మేశాడు : బండి సంజయ్

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు-నిధులు-నియామకాలు అనేది నినాదమని… అట్లాంటి మొదటి నినాదమైన నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ నోట్లో కేసీఆర్ మట్టి కొట్టాడని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ నెంబర్ 1 ద్రోహి కేసీఆర్ అని… మొదటి అపెక్స్ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేసాడని… ఏ సోయితో 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడని ప్రశ్నించారు.

క్రిష్ణా నదీ జలాల వాటా విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు డ్రామాలాడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని… నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టడానికి 6 ఏళ్ళ క్రితమే పునాది పడిందన్నారు. 2014-15 మధ్య కాలంలో 3 సార్లు సమావేశమై తెలంగాణా కు 299 టీఎంసీ ల నీటికి ఒప్పుకున్నారని.. కేంద్రం సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం సంతకాలు పెట్టింది ముమ్మాటికీ వాస్తవమన్నారు.

2019 లోనే నీటి వాటాలు, ఏపీ లో అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్, జగన్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఎన్నికల ఖర్చు కోసం జగన్ కు 600 కోట్ల మేరకు ఓ కాంట్రాక్టర్ ద్వారా కేసీఆర్ ఆర్థిక సాయం చేశాడని ఆరోపించారు. జగన్ అధికారంలో కొస్తే పోలవరం సహా ఏపీలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నింట్లో కమీషన్లను దొబ్బొచ్చని కేసీఆరే సలహా ఇచ్చాడని… అధికారంలోకి రాగానే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని విమర్శలు చేశారు బండి సంజయ్‌. CM పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని… హుజురాబాద్ లో ఓడిపోతామనే కేసీఆర్ డ్రామాలడుతున్నాడని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version