కేసీఆర్ ఉండేది ఇంకా 6 నెలలే..ఇంట్లో చప్పుడు చేయకుండా ఉండు – బండి సంజయ్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉండేది ఇంకా ఆరునెల్లో.. యెడదో…ఇంట్లో చప్పుడు చేయకుండా ఉండాలని హెచ్చరించారు బండి సంజయ్‌. గౌరవెల్లి ప్రాజెక్టు లో రక్తం పారిస్తున్నారని.. బాసరలో ట్రిపుల్ ఐటి సమస్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. విద్యార్థులు రోడ్డెక్కిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని.. ట్రిపుల్ ఐటిలో కనీస సదుపాయాలు కల్పించండని డిమాండ్‌ చేశారు. గౌరవెల్లి భూ బాధితులపై పోలీసుల దాడి ఘటనపై HRC లో ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు.

బండి సంజయ్

తెలంగాణ లో కేసీఆర్ ఓటమి ఖాయమని.. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్‌. 250 కోట్ల రూపాయల ప్రకటనలు దేశ వ్యాప్తంగా ఎందుకు ఇచ్చారు ? ఇక్కడ రైతులకు మాత్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లకు గొడవ పెట్టింది ప్రభుత్వమని.. సర్పంచ్ లను అప్పుల పాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వమన్నారు. బిల్లుల అడిగితే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version