రాజమౌళి, బరిగలతో కొట్టి చంపుతాం : బండి సంజయ్ వార్నింగ్ !

ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ కు టోపీ పెట్టడం పెను వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఈ అంశం మీద రాజమౌళికి ఓ ఎంపీ వార్నింగ్ ఇవ్వగా ఈరోజు తెలంగాణా బీజేపే అధ్యక్ష్యుడు వార్నింగ్ ఇచ్చారు. కొమరం భీం కు టోపి పెట్టడం ఏంటీ రాజమౌళి ? దుమ్ముంటే నీజాం రజాకార్ల కు బొట్టు పెట్టి తియ్యి సినిమా! అని అన్నారు. డైరెక్టర్ రాజమౌళి ని హెచ్చరిస్తున్న కొమురం భీం కి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తామని ఆయన అన్నారు.

కొమురం బీమ్ ను కించపరిచేలా సినిమా తీసిన రాజమౌళి కి గుణపాఠం తప్పదని అన్నారు. మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినావు దమ్ముంటే ఓల్డ్ సిటీ లో వున్న ముస్లింకి కాషాయం కండువా వేసి సినిమా తీయమని అన్నారు. బిడ్డ రాజమౌళి సినిమా రిలీజ్ చేస్తే.. బరిగలతో కొట్టి చంపుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 80 శాతం ఉన్న హిందువుల పట్ల మాట్లాడుతుంది అంటే.. మాది మతతవ్వ పార్టీ అంటున్న కేసీఆర్ ఎంఐఎంతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే నువ్వు నిజమైన హిందువా అని ప్రశ్నించారు.