తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ : బండి సంజయ్

-

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కరీంగనర్ ఎంపీ బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నుండి అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో విమోచనోత్సవాలను పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో అధికారంలో లేకపోయినా ప్రజల అభిమతాన్ని గుర్తించి కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు దగుల్బాజీ పార్టీలు. విమోచన దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాలను ఎందుకు జరుపుకోవడం లేదని తిట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు. ఆ నోరేమైంది? సిగ్గుండాలే. అధికారంలోకి వచ్చాక నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్. అప్పుడే అర్ధమైంది. తెలంగాణలో మళ్లీ నయా నిజాం పాలన అమలు కాబోతోందని.. ఆనాడు భయపడ్డట్లే జరుగుతోంది.పాతబస్తీలో నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలిపిన ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదు. జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త రాగం అందుకున్నడు.

కేసీఆర్ పార్టీ పుట్టకముందే తెలంగాణ కోసం 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన పార్టీ బీజేపీ. కేసీఆర్ అంతటి మోసగాడు, దగుల్బాజీ మరొకరు లేరు. మంత్రి పదవి కోసం అజయ్ రావు గా ఉన్న తన కొడుకు పేరును తారక రామారావుగా మార్చిన మోసగాడు కేసీఆర్. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్.

బీఆర్ఎస్ చవట దద్దమ్మల్లారా.. మీరెందుకు విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదు? ఎందుకు అడ్డుకుంటున్నారు. మీరు నిజంగా తెలంగాణ వాదులైతే.. మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే బీఆర్ఎస్ నుండి బయటకు రండి. విమోచన దినోత్సవాలను నిర్వహించండి. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు కానీయబోదు.దేశ ప్రజల అభ్యున్నతికి నిరంతరం క్రుషి చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. వారి స్పూర్తితో భరత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించేదాకా క్రుషి చేస్తాం. మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లలాలని భగవంతుడిని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version