BREAKING : పోలీస్ రిక్రూట్ మెంట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ఆర్దికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు.

పోలీస్ రిక్రూట్ బోర్టు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version