ఇంటి కొనుగోలుదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కోవిడ్19 సమయం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం సర్కార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులకు ఊరట కలిగించే నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది.
తాజాగా రెసిడెన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్లపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి సమయాన్ని ఎక్స్టెండ్ చేసింది కేంద్రం.

మామూలుగా అయితే ఈ గడువు జూన్ 30తో ముగియాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత ఇల్లు కొనుగోలు చేసిన వారు పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువును 3 నెలలు పొడిగించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54జీబీ ప్రకారం మీరు మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ప్రాపర్టీ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనడానికి వాడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version