టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ ముందునుండి మా ఎన్నికల్లో తాను ప్రకాష్ కు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఏర్పాటుచేసిన ప్యానెల్ మీటింగ్ లో కూడా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ప్రకాష్ రాజ్ మరోసారి తన ప్యానల్ ప్రకటించారు. అందులో లో అధ్యక్ష పదవికి పోటి చేస్తామని చెప్పిన జీవిత మరియు హేమ లకు జనరల్ సెక్రెటరీగా గా ప్రకాశ్ రాజ్ అవకాశం ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో బండ్ల గణేష్ పేరు మాత్రం కనిపించలేదు.
బండ్ల గణేష్ ను స్పోక్స్ పర్సన్ గా ప్రకాష్ రాజ్ నియమించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బడ్ల హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సొంతంగా జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేసినట్టు ప్రకటించారు. స్పోక్స్ పర్సన్ పదవి తనకు సంతృప్తిగా లేదని ఆ పదవిని వేరే వాళ్లకి ఇవ్వాలి అని ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ సూచించారు. అంతేకాకుండా బండ్ల గణేష్..ప్రకాష్ రాజ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. జనరల్ సెక్రటరీ పదవికి తాను పోటీ చేస్తానని అందరికీ అవకాశం ఇచ్చారని తనకు అవకాశం ఇస్తే తానేంటో చూపిస్తానని బండ్ల గణేష్ కోరారు.