తెలంగాణలో డెంగీ పంజా.. ఆస్పత్రిలో చేరిన 700 మంది చిన్నారులు!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగీ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై ఈ డెంగీ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ లో ఏకంగా 9 చిన్న పిల్లల వార్డులు… చిన్నారులతో నిండిపోయాయి.

dengue | డెంగ్యూ
dengue | డెంగ్యూ

గత నెల నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్న… దాదాపు 700 నుంచి 750 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30 నుంచి 40 శాతం మంది లో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. గత రెండు వారాల్లో 80 మంది వరకు చిన్న పిల్లలు డెంగీ తో చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో… 3, 8, మరియు పదహారు సంవత్సరాల వయస్సు ఉన్న ముగ్గురు బాలురతో పాటు ఆరేళ్ల బాలిక మృతి చెందారు. ఈ నలుగురు ఆఖరి దశలో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. ఇక డెంగీ పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయింది.