వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సినీ నటుడు, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం ట్విట్టర్ ‘ఎక్స్’వేదికగా ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. టాలీవుడ్ ప్రముఖులపై విరుచుకపడ్డారు.
సినీ ఇండస్ట్రీలో మెగాస్టర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కొందరు మినహా అగ్రనటులు ఎవరూ రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పలేదు. దీంతో వారిని ఉద్దేశించి బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు.తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం.‘టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు ఇండస్ట్రీలో పెనుసంచలనం సృష్టిస్తోంది.