మరోసారి త్రివిక్రమ్ పై సెటైర్స్ వేసిన బండ్ల గణేష్ .!

-

కమేడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి అటు తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించాడు టాలీవుడ్‌ యాక్టర్‌ బండ్ల గణేష్‌. ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌లలో పాల్గొంటూ పవన్ ను విపరీతంగా పొగుడుతూ తాను హైలైట్ అవుతూ ఉంటాడు. ఇక మనోడు కొన్ని రోజులు రాజకీయాల్లో వెళ్లి చేతులు కాల్చుకొని వచ్చాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు.

అంతకు ముందు పవన్ ఎక్కడ ఉన్నా వాలిపోయే బండ్లకు అంత ఛాన్స్ రాకుండా త్రివిక్రమ్ గోడలా అడ్డుపడుతూ ఉన్నాడని తెలుస్తోంది. బండ్ల గణేష్ ఏదో ఒకటి వాగి నిన్ను కూడా పలచన చేస్తాడని పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ పవన్ వెంట తిరుగుతూ సలహాలు సూచనలు ఇస్తున్నాడు. అందుకే బండ్ల గణేష్ గతంలో ఓ అభిమానితో ఫోన్ లో మాట్లాడుతూ త్రివిక్రం పై ఓ రేంజ్ లో విరుచుకు పడ్డాడు.

ఇక లేటెస్ట్ గా మరో ఇంటర్వ్యూలో పరోక్షంగా త్రివిక్రం పై మరో సారి తన కోపం ప్రదర్శించాడు. బండ్ల మాట్లాడుతూ పవన్ లో టాలెంట్ తాను ముందుగానే గుర్తించానని. అతను మాములు వ్యక్తి కాదని ముందే తెలుసని.. ఆయనలో ఉన్న సూపర్ పవర్ ను  బయటకు తీసింది నేనే అని అన్నారు బండ్ల గణేష్. ఇప్పుడు ఎవరో గురూజీ బరూజీ అని అంటున్నారని ఇవేమి నాకు అవసరం లేదని వెటకారంగా సమాధానం ఇచ్చాడు. విచిత్రంగా గా పవన్ కూడా వీరి మధ్య ఉన్న గొడవ ను తీర్చడం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news