యంగ్ హీరోయిన్స్ మైండ్ బ్లాంక్ చేసిన శ్రుతి హసన్!

-

తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్   తనకు టర్నింగ్ పాయింట్ గా మారింది. చాలా రోజులు గ్యాప్  తర్వాత   గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా మళ్లీ ఆమె కెరియర్ కు ఊపిరి పోసింది.

ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమా లో, బాలయ్య బాబు తో వీర సింహ రెడ్డి లో అలాగే, పాన్ ఇండియా స్టార్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం సలార్ లో కూడా నటిస్తోంది.

ఇక సీనియర్ హీరోలకు మెయిన్ ఆప్షన్ గా ఉన్న శ్రుతి ఇప్పుడు చిరంజీవి బాలయ్య బాబు సినిమాలకు అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకొంటోంది. మేకర్స్ సన్నిహితుల ప్రకారం ఆమె ఒక్కో సినిమా కు రెండు కోట్లకు పైగా వసూలు చేస్తోంది. ఇప్పుడు రీసెంట్ హీరోయిన్స్ కూడా అంత మొత్తం తీసుకోవడం లేదు. ఈ ఫిగర్ విని వాళ్లు దిమ్మతిరిగినంత పని అయ్యిందట. అక్కడ సీనియర్స్ కు  ఆప్షన్ గా ఏ మొక్క లేనపుడు ఆముదం మొక్కే పెద్ద దిక్కుగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news