బండ్ల గణేష్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. 2024లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో దరఖాస్తు చేశారు. తర్వాత బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై బండ్ల గణేష్ మండిపడ్డారు.
ఇంద్రవెల్లి సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఆ రెండు రోజులు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నానని అన్నారు బండ్ల గణేష్.