కొత్త మలుపు తీసుకున్న బెంగళూరు డ్రగ్స్‌ కేసు ..అధికార పార్టీలో అలజడి

-

కర్ణాటక డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసు విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి కలహర్‌ రెడ్డిని ప్రశ్నించారు బెంగళూరు పోలీసులు. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విచారణలో కలహర్ రెడ్డి మరికొంత మంది పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ట్రావెల్స్‌ యజమాని రతన్‌రెడ్డిని కూడా విచారించనున్నారు. వీరిద్దరి వాంగ్మూలాల‌ను బ‌ట్టి తెలంగాణ ఎమ్మెల్యేల‌పై దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నారు పోలీసులు ఇదే ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతుంది.

పార్టీలో డ్రగ్స్‌ ఎవరు సప్లై చేశారు. ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారనే విషయాలపై దృష్టిపెట్టారు పోలీసులు. మరో వైపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత శంకర గౌడను మరోసారి పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉండడంతో కేసు విచారణలో పకడ్భందీగా విచారణ చేయాలని భావిస్తున్నారు కర్ణాటక పోలీసులు. నిందితుల వాంగ్మూలాల‌తోపాటు.. పార్టీ జరిగిన స‌మ‌యంలో తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నట్లు నిరూపించేందుకు ఆధారాలు సేక‌రిస్తున్నారు.

ఓ తెలంగాణ ఉద్యమకారుడి ప్రమేయం కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు శివారుల్లో జరిగిన పార్టీలకు అతనే కొకైన్ తెచ్చాడని, ఆ పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తికి క్యాబ్ ల వ్యాపారం కూడా ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. కలహర్ రెడ్డితో కలిసి సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసేవాడని అంటున్నారు. తన క్యాబ్ ల ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు, ప్రతి నెలా బెంగళూరులో పార్టీ ఏర్పాటు చేసి హైదరాబాదు నుంచి ప్రముఖులను తీసుకుని వెళ్లేవాడని కూడా తెలుస్తుంది.

ఇప్పటిదాకా ఈ కేసులో తెలంగాణ‌కు చెందిన న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్లు మాత్రమే ఉన్నట్టు ప్రచారం జ‌రిగింది. అయితే ఆ జాబితా న‌లుగురితో ఆగిపోలేద‌ని ఈ మ‌త్తులో మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా కూరుకుపోయార‌ని తెలుస్తోంది. ఎమ్మెల్యేల విష‌యంలో ప‌క‌డ్బందీగా విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణయించిన పోలీసులు.. నిందితుల వాంగ్మూలాల‌తో పాటు.. డ్రగ్స్ పార్టీలు జరిగిన స‌మ‌యాల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా బెంగళూరులో ఉన్నట్లు టెక్నిక‌ల్ ఎవిడెన్స్ సేక‌రించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news