అబుధాబిలో శనివారం జరిగిన ఐపీఎల్ 2020 15వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చేసిన స్కోరు తక్కువగానే ఉండడంతో బెంగళూరు ఆ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఆచి తూచి ఆడుతూ ఎట్టకేలకు విజయం సాధించారు.
మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో లామ్‌రార్ (47 పరుగులు, 1 ఫోర్, 3 సిక్సర్), రాహుల్ తెవాతియా (24 పరుగులు నాటౌట్, 3 సిక్సర్లు)లు రాణించారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా, ఉదానా 2 వికెట్లు తీశాడు. నవదీప్ సైనీకి 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 158 పరుగులు సాధించింది. ఈ క్రమంలో రాజస్థాన్‌పై బెంగళూరు సునాయాసంగా గెలుపొందింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి (72 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (63 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్‌లు చెరొక వికెట్ తీశారు.