కేబుల్ బ్రిడ్జ్ మీద బండి ఆపితే చలాన్ లు పడేలా సీసీ కెమెరాలు

-

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై సైబ‌రాబాద్ పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఎటువంటి ఆంక్షలు లేకపోగా నిన్ననే కొన్ని ఆంక్షలు విధించారు. దాని ప్రకారం శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 వ‌ర‌కు బ్రిడ్జిని మూసివేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. మిగితా రోజుల్లో రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు. కేబుల్ బ్రిడ్జిపై వాహ‌నాల వేగం 35 కిలోమీట‌ర్ల‌కు మించ‌కూడ‌దు.

అలానే కేబుల్ బ్రిడ్జి రైలింగ్ పై కూర్చోవ‌డం నిషేధం విధించారు. బ్రిడ్జిపై పుట్టిన‌రోజు, ఇత‌ర వేడుక‌లు చేసుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. బ్రిడ్జిపై వాహ‌నాలు నిలుప‌రాదని,మ‌ద్యం సేవించ‌రాదు. అయితే బ్రిడ్జి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ మీద బండి ఆపితే నో పార్కింగ్ చార్జీలు ఆన్ లైన్ లో వేసి చలాన్ పంపంనున్నారు. కాబట్టి అంతా ఈ ఆంక్షలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు కూడా పెట్టనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version