భళా బంగ్లాదేశ్… ఇండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ – 266 !

-

టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదటగా బ్యాటింగ్ చేసింది. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న టాంజిద్ హాసన్ (13) ఆకట్టుకోలేదు. ఇక ఎప్పటిలాగే లిటన్ దాస్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు, ఆసియా కప్ లో తొలిసారి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న అనాముల్ హాక్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ మొక్కవినో దీక్షతో పాతుకుపోయాడు. ఇక ఇతనికి మెహిదీ హాసన్ నుండి కొంచెం సేపు సహకారం లభించినా 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు గత మ్యాచ్ లో మెరిసిన తౌహీద్ హృదయ్ … ఇద్దరూ కలిసి అయిదవ వికెట్ కు 101 పరుగులు జోడించారు. షకిబుల్ హాసన్ 80 పరుగుల వద్ద అవుట్ కాగా , తౌహీద్ హృదయ్ 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక ఇక 200 లోపు మ్యాచ్ ముగుస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ లోయర్ ఆర్డర్ మ్యాజిక్ చేసింది.. నాసూమ్ అహ్మద్, మహేది హాసన్ మరియు తాంజిం హాసన్ లు కలిసి 87 పరుగులు జోడించారు. అలా చివరికి నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో శార్దూల్ మూడు మరియు షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు. మరి ఈ స్కోర్ ను ఇండియా ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతసేపు వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news