రాజాలింగమూర్తి హత్యపై గండ్ర వెంకటరమణా రెడ్డి ఏమన్నారంటే?

-

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నిన్న జరిగిన రాజాలింగమూర్తి హత్యపై స్పందిస్తూ..ఈ హత్యతో బీఆర్ఎస్ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భూపాలపల్లిలో జరిగిన రాజాలింగమూర్తి హత్యను ఖండించారు.

ఈ మర్డర్ మీద మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. హత్య జరిగాక మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ హత్య నెపాన్ని బీఆర్ఎస్ , కేసీఆర్, హరీష్ రావుతో పాటు తనపైనా నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news