IND W VS BAN W: సెంచరీ చేసిన తొలి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ గా రికార్డ్… !

-

ఈ రోజు బంగ్లాదేశ్ మరియు ఇండియా మహిళల మధ్యన మూడవ వన్ డే జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కాగా బాంగ్లాదేశ్ ఇంత స్కోర్ సాధించడానికి కీలకంగా ఆ జట్టు ఓపెనర్లు షమీమా సుల్తానా మరియు ఫర్గాన హాక్ నిలిచారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఫర్గాన హాక్ దాదాపు చివరి వరకు నిలబడి సెంచరీ సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించింది. ఈ సెంచరీ తో ఫర్గానా హాక్ ప్రపంచ రికార్డును సాధించింది. బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళా క్రికెటర్ కూడా సెంచరీ చేయకపోవడం గమనార్హం. కానీ మ్యాచ్ తో ఆ మచ్చ తొలగిపోయింది. బంగ్లా ఓపెనర్ గా వచ్చిన ఫర్ఘానా హక్ 160 బంతులు ఆడి 107 పరుగులు చేసి రన్ ఔట్ గా వెనుతిరిగింది. ఈమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు ఉండడం విశేషం.

ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికి వన్ డే సీరీస్ దక్కుతుంది. కాగా ఇప్పటికే టీ సీరీస్ ను ఇండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి సీరీస్ ను దక్కించుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version