బ్యాంక్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఆఫర్.. రూ.15,000 బెనిఫిట్…!

-

మీరు ఫ్రీగా క్రెడిట్ కార్డు ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. మీకోసం ఓ అదిరే ఆఫర్ ని బ్యాంకు తీసుకు వచ్చింది. దీనితో మీరు ఇప్పుడు ఫ్రీగానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ కోసం ఓ ఆఫర్ ని తీసుకు వచ్చింది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే.

ఎంపిక చేసిన ఛానల్స్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఆఫర్ ని ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు పైన ఈ ఆఫర్స్ వున్నాయి. అంటే మీరు ఫ్రీగానే ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఒక సినిమా టికెట్ ని మీరు దీని మీద బుక్ చేస్తే 100 శాతం డిస్కౌంట్ వస్తుంది. పేటీఎం మూవీస్ ద్వారా మీరు టికెట్లు బుక్ చెయ్యాలి.

సోనీలివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు మీకు వస్తుంది. అలానే స్విగ్గీ ఆర్డర్ల పై 40 శాతం తగ్గింపు ఉంది. ఇలా పలు లాభాలని మీరు పొందొచ్చు. ఈ కార్డు మీద మీకు మొత్తంగా ఏడాదిలో రూ. 15 వేల వరకు తగ్గింపు వస్తుంది. కేవలం యాక్సిస్ బ్యాంక్ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్‌ను అందుబాటులో ఉంచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version