వివాహ బంధంతో ఒక్కటైన జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్..!

-

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు రాకింగ్ రాకేష్. గత కొంతకాలంగా న్యూస్ రిప్రెసెంటర్ గా పనిచేసిన సుజాత తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ జబర్దస్త్ స్కిట్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తను ప్రేమించిన సుజాతతో ఈ రోజున ఏడడుగులు వేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు, జబర్థస్త్ కమెడియన్ ల సమక్షంలోనే జరిగినట్లుగా సమాచారం.

ఇక ఈ వేడుక తిరుపతిలో చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే దాదాపుగా 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చిన రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించారు. చాలా చోట్ల షోలు చేసి మంచి పాపులారిటీ అందుకున్న రాకేష్ ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత కిరాక్ ఆర్పి రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ కూడా లీడ్ చేశారు.

ఇక ఆర్పి వెళ్లిపోవడంతో సింగిల్గా టీం లీడర్ గా మారిపోయారు ఇక అప్పటినుంచి కొన్నేళ్లపాటు తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఇక సుజాత కూడా బిగ్బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రాకేష్ తో ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టింది దీంతో రాకేష్ టీం లో స్కిట్లు చేస్తూ వస్తున్న సమయంలో అని వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version